News March 4, 2025

సిద్దిపేట: తైక్వాండో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

image

మార్చి 1, 2 తేదీలలో హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 13వ ఓపెన్ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్స్ తైక్వాండో ఛాంపియన్షిప్‌లో సిద్దిపేట జిల్లా తైక్వాండో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 12 మెడల్స్ సాధించారని తైక్వాండో కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను సిద్దిపేట జిల్లా తైక్వాండో అధ్యక్షుడు రాధాకృష్ణశర్మ, ఉపాధ్యక్షుడు రామ్మోహన్ అభినందించారు.

Similar News

News March 27, 2025

PPM: అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

గిరిజన సబ్ ప్లాన్ (టీ.ఎస్.పీ) ప్రాంత అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖాధికారి డా.టి.కనక దుర్గ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం, సీతంపేటలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ట్రైబల్ సబ్‌ప్లాన్ ఏరియాలలో 9 అంగన్‌వాడీ వర్కర్లు, 15 అంగన్‌వాడీ హెల్పర్‌లు,12 మినీ అంగన్వాడీ కార్యకర్తల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినట్టు చెప్పారు.

News March 27, 2025

భీమవరంలో ప్రేమ పేరుతో మోసం

image

ప్రేమంటూ మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం పట్టణానికి చెందిన ఓ యువతిని గుడిసె ఉదయ్ ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఈక్రమంలో 2023 మేలో ఆమెను లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చాడు. ఇటీవల యువతి గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. ఈనెల 22న యువతి ఫిర్యాదు చేయగా.. ఉదయ్‌ను అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం తణుకు జైలుకు తరలించారు.

News March 27, 2025

నకిరేకల్: ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్

image

తన <<15867903>>డిబార్‌ను రద్దు<<>> చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని శాలిగౌరారానికి చెందిన ఝాన్సీలక్ష్మి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, NLG DEO, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నకిరేకల్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారని విద్యార్థిని పేరెంట్స్ తెలిపారు. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

error: Content is protected !!