News February 12, 2025
సిద్దిపేట: త్వరలో పెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు

కుకునూరుపల్లి హనుమాన్ నగర్‌కి చెందిన గడ్డం గణేశ్(22) మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. కానీ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గణేశ్ తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఫోన్ మాట్లాడివస్తానని ఇంటి బయటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.
Similar News
News February 24, 2026
కృష్ణా డెల్టాకు 195 టీఎంసీలు కావాల్సిందే.. ఏపీ వాదన

AP: కృష్టా డెల్టాలో రైతులు స్వల్పకాలిక రకాలను సాగు చేయాలంటూ TG ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏపీ ఖండించింది. ‘కృష్ణా డెల్టాలో పంట కాలాన్ని 180 రోజులుగా KWDT-1 నిర్ధారించింది. ఇందుకు 195 టీఎంసీల నీరు అవసరం. అయితే తెలంగాణ ప్రతినిధి పంట కాలాన్ని 122 రోజులుగా చెబుతూ 130 టీఎంసీలే సరిపోతాయని చెప్పడం అశాస్త్రీయం’ అని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ న్యాయవాది జైదీప్ వాదనలు వినిపించారు.
News February 24, 2026
యాభై ఏళ్ల ప్రస్థానం.. ముగిసినట్లేనా?

ADB, KNR జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి తగ్గింది. అగ్రనేత దేవ్ జీ లొంగుబాటు వార్తలతో KNR జిల్లాలో ముప్పాల లక్ష్మణరావుతోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడే మిగిలినట్లు తెలుస్తోంది. 2000 నుంచి 2026, ఫిబ్రవరి 21 వరకు మావోయిస్టుల పోరులో మొత్తం 12,170 మంది మృతి చెందారు. వీరిలో 5,057 మంది మావోయిస్టులు, 2,007 మంది భద్రతా సిబ్బంది, 4,138 మంది పౌరులున్నారు. మూడేళ్లలో 793 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.
News February 24, 2026
భూపాలపల్లి జిల్లాలో 8.4 మి.మీల వర్షపాతం నమోదు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 8.4 మి.మీల వర్షపాతం నమోదైంది. టేకుమట్ల మండలంలో అత్యధికంగా 6.2 మి.మీలు, రేగొండ మండలంలో 2.2 మి.మీల వర్షం కురిసింది. మహాదేవ్‌పూర్, పలిమెల, కాటారం, రేగొండ తదితర మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీలుగా నమోదైనట్లు సీపీఓ కార్యాలయం వెల్లడించింది.


