News February 12, 2025

సిద్దిపేట: త్వరలో పెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు

image

కుకునూరుపల్లి హనుమాన్ నగర్‌కి చెందిన గడ్డం గణేశ్(22) మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. కానీ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గణేశ్ తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఫోన్ మాట్లాడివస్తానని ఇంటి బయటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.

Similar News

News March 19, 2025

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్‌

image

TG: మెక్‌డొనాల్డ్స్ తన గ్లోబల్ ఆఫీస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు CM రేవంత్ మెక్‌డొనాల్డ్స్ CEO క్రిస్ కెమ్‌కిన్స్కి‌తో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా 2,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌‌లు ఉండగా, ఇక నుంచి ఏటా 3- 4 కొత్త అవుట్‌లెట్‌లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రైతులు దాని కార్యకలాపాలకు తాజా ఉత్పత్తులను సరఫరా చేయనున్నారు.

News March 19, 2025

సంగారెడ్డి: పరీక్షకు 96.63% హాజరు

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.63% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.18,616 మంది విద్యార్థులకు గాను 17,989 మంది విద్యార్థులు హాజరయ్యారని, 627 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

News March 19, 2025

క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తున్నారా?

image

కొందరు ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని భావిస్తుంటారు. కానీ వాటిని తీసేస్తే క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. క్రెడిట్ స్కోర్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా ఆదుకుంటాయి. ఈ కార్డులను యాక్టివ్‌గా ఉంచుకోవడమే బెటర్. అతిగా ఖర్చు చేసేవారు మాత్రం క్లోజ్ చేసుకుంటేనే మంచిది. మీరు ఉపయోగించకపోయినా మేనేజ్‌మెంట్ ఛార్జీలు ఎక్కువైతే కార్డు తీసేయడం ఉత్తమం.

error: Content is protected !!