News February 12, 2025
సిద్దిపేట: త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్ర

సిద్దిపేట: త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్రసంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
NZB: మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవులు

నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌కు వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. 14న హోలీ, 15న దల్హండి, 16న ఆదివారం కావడంతో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవన్నారు. దీనిని గమనించి రైతులు పంట దిగుబడులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు. 17తేదీ నుంచి యథావిధిగా మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.
News March 13, 2025
ఇన్‌స్టా పరిచయం గొడవకు దారితీసింది!

ఇన్‌స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్‌గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.
News March 13, 2025
బొమ్మలరామారంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఎల్లో అలర్ట్ జారీ

యాదాద్రి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు పెరిగింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొమ్మలరామారం మండలంలో బుధవారం 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.