News February 8, 2025
సిద్దిపేట: దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దగా: హరీశ్ రావు

దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’లో మండిపడ్డారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు విలువ లేదా అని ఎద్దేవా చేశారు. ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.14 నెలల కాంగ్రెస్ పాలనలో గందరగోళం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలన్నారు.
Similar News
News December 24, 2025
రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 24, 2025
BELలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 24, 2025
గన్నవరం: వల్లభనేని వంశీ మళ్లీ సైలెంట్.. కేసుల భయమేనా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత నెల రోజుల నుంచి యాక్టివ్గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఫంక్షన్లు, బాధిత కుటుంబాల వద్దకు వెళ్తూ ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో వంశీ అనుచరులు దాడి చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇటీవల వంశీపై మరో కేసు నమోదైంది. దీంతో వారం రోజుల నుంచి వంశీ మళ్లీ సైలెంట్ అయ్యారు. ఆ కేసులో బెయిల్ తీసుకున్న తర్వాత మళ్లీ ఆయన పర్యటించే అవకాశం ఉంది.


