News February 16, 2025
సిద్దిపేట: దారుణం.. తమ్ముడిని కొట్టి చంపిన అన్న

తమ్ముడిని హత్య చేసిన అన్నను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. మునిపల్లి మండలం చీలపల్లి చెందిన శివయ్యను శుక్రవారం సాయంత్రం తన అన్న యాదయ్య హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం యాదయ్య పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. విచారణలో శివయ్యను బండరాయితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
Similar News
News November 11, 2025
KMR: ఈ నెల 17న ‘ఆస్మిత’ అథ్లెటిక్స్ పోటీలు

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికల కోసం ఏర్పాటు చేసిన ‘ఆస్మిత’ ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్స్ ఈ నెల 17న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ లీగ్స్ కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో 8 గంటలకు ప్రారంభం అవుతాయి. క్రీడాకారులు తప్పనిసరిగా తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ డ్రెస్ కోడ్‌తో హాజరు కావాలని పేర్కొన్నారు.
News November 11, 2025
KMR: ధాన్యం కొనుగోళ్ల కోసం కంట్రోల్ రూమ్

కామారెడ్డి జిల్లాలో ధాన్యం, పత్తి, సోయా వంటి పంట ఉత్పత్తుల కొనుగోళ్ల నిర్వహణపై రైతులకు సౌకర్యార్థం జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ (DM కార్యాలయం) 08468-220051, రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబర్లు 180042500333, 180042501967 ఏవైనా సమస్యలు/ సందేహాలు ఉంటే రైతులు ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
News November 11, 2025
ఆదిలాబాద్: APK ఫైల్ ఓపెన్ చేశాడు.. రూ.2 లక్షలు స్వాహా

వాట్సప్‌లో వచ్చిన APK ఫైల్ ఓపెన్ చేసి ఓ బాధితుడి నగదును కోల్పోయాడని 1 టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. శాంతినగర్‌కు చెందిన వ్యాపారి తొడంబార్ శ్రీకాంత్ తన తండ్రి పేరు మీద ఉన్న కారుకు చలాన్ కట్టాలంటూ RTO ఈ చలాన్ APK ఫైల్ సందేశం వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ చేసి ఆధార్ కార్డు, పాన్ నంబర్ ఎంటర్ చేశారు. దీంతో అతని తండ్రి అకౌంట్ నుంచి 9 విడతలుగా రూ..2.39 లక్షలు డబ్బులు కట్ అయ్యాయని పేర్కొన్నారు.


