News January 26, 2025
సిద్దిపేట: దేశభక్తిని చాటుకున్న రైతులు

మట్టి మనుషుల దేశభక్తికి మువ్వన్నెల జెండా మురిసిపోయింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలంలోని రాయవరం గ్రామంలో రైతులు తన వ్యవసాయ పొలం వద్ద జెండా ఆవిష్కరణ చేసి వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇది చూసిన పలువురు స్థానికులు దేశభక్తంటే.. ఇది కదా అంటూ వారిని మెచ్చుకున్నారు.
Similar News
News November 5, 2025
ఐఐటీ గాంధీనగర్ 36 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 5, 2025
బాపట్ల: మద్యం తాగి బస్సు నడుపిన డ్రైవర్

బాపట్ల జిల్లా SP ఆదేశాల మేరకు మార్టూరు సీఐ శేషగిరిరావు, రవాణాశాఖ అధికారులు NH–16పై మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అతివేగంగా వస్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ను తనిఖీ చేయగా.. డ్రైవర్ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బస్ డ్రైవర్ను తనిఖీ చేయకుండా పంపిన మేనేజర్, కెప్టెన్లపై కూడా చర్యలు చేపట్టారు.
News November 5, 2025
న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.


