News January 26, 2025
సిద్దిపేట: దేశభక్తిని చాటుకున్న రైతులు

మట్టి మనుషుల దేశభక్తికి మువ్వన్నెల జెండా మురిసిపోయింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలంలోని రాయవరం గ్రామంలో రైతులు తన వ్యవసాయ పొలం వద్ద జెండా ఆవిష్కరణ చేసి వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇది చూసిన పలువురు స్థానికులు దేశభక్తంటే.. ఇది కదా అంటూ వారిని మెచ్చుకున్నారు.
Similar News
News February 19, 2025
కామారెడ్డి: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:విద్యాశాఖ కమిషనర్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 19, 2025
ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
News February 19, 2025
దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పరిసరాలు, వంటగది, తరగతి గదులు, మరుగు దొడ్లు పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తనిఖీ చేశారు. నెలలోపు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.