News April 30, 2024
సిద్దిపేట: నాడు తండ్రి.. నేడు తల్లిని చంపిన కొడుకు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తిలో కొడుకు నరసింహులు దాడిలో గాయపడిన తల్లి భారతమ్మ(55) మృతి చెందింది. మద్యానికి బానిసైన నర్సింలు ఈనెల 27న తల్లితో గొడవపడి దాడి చేశాడు. చికిత్స పొందుతూ ఆమె నిన్న చనిపోయింది. కాగా 9ఏళ్ల క్రితం తండ్రి బాలమల్లుతో గొడవపడి దాడి చేయగా మృతి చెందాడు. కూతురు సరస్వతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 27, 2024
సిద్దిపేట: CPR చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
కానిస్టేబుల్ సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. స్థానికుల సమాచారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మండల కేంద్రానికి చెందిన సందీప్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ లింగం వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి తలుపులు పగలగొట్టి సందీప్ రెడ్డి కిందకు దింపాడు. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో CPR చేసి ప్రాణాలు కాపాడారు.
News November 27, 2024
మెదక్: RTCలో ఉద్యోగాలు
మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. మెదక్ రీజియన్‌లో 81 పోస్టులను కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT
News November 26, 2024
నమ్మకంతో ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలి: కలెక్టర్ రాహుల్ రాజ్
ఓటర్లందరూ ఎన్నికల ప్రక్రియ, భారత ఎన్నికల సంఘంపై నమ్మకం కలిగి, ప్రజాస్వామ్య ప్రాతిపదికగా నిర్వహించే ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. ఈవీఎంలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టి వేసిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం తగదన్నారు.