News January 29, 2025
సిద్దిపేట: నిఘా నీడలో ప్రాక్టికల్స్: రవీందర్

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిఘా నీడన పకడ్బందీగా జరగనున్నాయని ఇంటర్మీడియట్ అధికారి రవీందర్ అన్నారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు 4 విడతలుగా జరిగే ఈ పరీక్షల నిర్వహణ కోసం ఈ సంవత్సరం అన్ని ప్రయోగశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News January 4, 2026
అంధకారంలో వెనిజులా.. స్తంభించిన జనజీవనం

వెనిజులాపై అమెరికా <<18750335>>వైమానిక దాడుల<<>> తర్వాత ఆ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. విద్యుత్ గ్రిడ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రాజధాని కరాకస్ సహా ప్రధాన నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఆహారం, అత్యవసర మందుల కోసం ప్రజలు బారులు తీరారు. ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి ప్రజలు రోడ్లపై పనిచేస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ వద్దకు చేరుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.
News January 4, 2026
తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ADB కమిటీ ఎన్నిక

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తోట భాస్కర్, కోశాధికారిగా జాబు రాజు లను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపెళ్లి శివప్రసాద్ తెలిపారు. సంఘం బలోపేతంతో పాటు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.
News January 4, 2026
రాంబిల్లి: అగ్ని ప్రమాదంపై కేసు నమోదు

రాంబిల్లి మండలం లాలంకోడూరు ఎస్.వీ.ఎస్. ఫార్మా కంపెనీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింగరావు ఆదివారం తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వీఆర్ఓ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.


