News February 24, 2025
సిద్దిపేట: నిప్పంటించుకుని ఇద్దరు సూసైడ్

సిద్దిపేట జిల్లాలో <<15557045>>నిప్పంటించుకుని<<>> ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డిన విషయం తెలిసిందే. వివరాలు.. ఈ ఘటనలో మహిళ అక్కడే మృతి చెందగా, పురుషుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి ఆధార్ కార్డ్‌ల ద్వారా సిద్దిపేటకు చెందిన లక్ష్మి(65), భర్త పేరు చందుగా, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్‌కు చెందిన శ్రీధర్(44), తండ్రి నర్సోజిగా పురుషుడి వివరాలు ఉన్నాయి. వీరిని గుర్తు పట్టిన వారు తొగుట పోలీసులను సంప్రదించాలని కోరారు.
Similar News
News February 24, 2025
NGKL: రెస్క్యూ కొనసాగుతుంది: మంత్రి

ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలను మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు నేతలు సమీక్షించారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. నీటిప్రవాహం సహాయ కార్యక్రమాలకు అడ్డంకిగా మారుతున్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలు బృందాలు పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.
News February 24, 2025
ACBకి పట్టుపడ్డ పాలకొండ మున్సిపల్ కమిషనర్

పాలకొండ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ వలకు చిక్కినట్లు తెలుస్తోంది. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లో మిస్టేక్స్ సరిదిద్దేందుకు డాక్టర్ రౌతు భారతి నుంచి కమిషనర్ సూచనల మేరకు అతని డ్రైవర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుంది. దీంతో కమిషనర్‌ను ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2025
KCR, హరీశ్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో BRS అధినేత KCR, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై భూపాలపల్లి క్రిమినల్ కోర్టు కేసీఆర్, హరీశ్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.