News February 24, 2025
సిద్దిపేట: నిప్పంటించుకుని ఇద్దరు సూసైడ్

సిద్దిపేట జిల్లాలో <<15557045>>నిప్పంటించుకుని<<>> ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వివరాలు.. ఈ ఘటనలో మహిళ అక్కడే మృతి చెందగా, పురుషుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి ఆధార్ కార్డ్ల ఆధారంగా సిద్దిపేటకు చెందిన లక్ష్మి(65), భర్త పేరు చందుగా, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్కు చెందిన శ్రీధర్(44), తండ్రి నర్సోజిగా గుర్తించారు. వీరి వివరాలు తెలిసిన వారు తొగుట పోలీసులను సంప్రదించాలని కోరారు.
Similar News
News November 17, 2025
రంగారెడ్డి: కలెక్టర్ గారూ.. ప్రభుత్వ బోర్డు మాయమైంది!

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో అక్రమార్కుల దృష్టిలో అలుసైపోతున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గంటిల వెంకటేశ్ ఆరోపించారు. మంచాల మం. ఆగపళ్లి గ్రామ పంచాయతీలోని సర్వే నం.191లో అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ బోర్డు 2 రోజులకే మాయమైంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు.

కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.