News February 24, 2025

సిద్దిపేట: నిప్పంటించుకుని ఇద్దరు సూసైడ్

image

సిద్దిపేట జిల్లాలో <<15557045>>నిప్పంటించుకుని<<>> ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వివరాలు.. ఈ ఘటనలో మహిళ అక్కడే మృతి చెందగా, పురుషుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి ఆధార్ కార్డ్‌ల ఆధారంగా సిద్దిపేటకు చెందిన లక్ష్మి(65), భర్త పేరు చందుగా, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్‌కు చెందిన శ్రీధర్(44), తండ్రి నర్సోజిగా గుర్తించారు. వీరి వివరాలు తెలిసిన వారు తొగుట పోలీసులను సంప్రదించాలని కోరారు.

Similar News

News March 23, 2025

టీబీ విభాగంలో భద్రాద్రికి రెండో బహుమతి

image

రాష్ట్ర స్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు 2024 ఏడాదికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రిజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతుల మీదుగా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీ అవార్డు అందుకున్నారు.

News March 23, 2025

ఉప్పల్‌లో IPL మ్యాచ్.. జాగ్రత్త బ్రో!

image

HYDలోని ఉప్పల్ వేదికగా ఇవాళ IPL జట్లు SRH, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. అయితే స్టేడియంలో ఆకతాయిల పని పట్టేందుకు ‘షీ టీమ్స్’ మఫ్టీలో మహిళల రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అమ్మాయిలను ఇబ్బంది పెడితే తాటతీసేలా చర్యలు ఉండనున్నాయి. మరోవైపు 2,700 మంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. IPL స్కోర్ అప్‌డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.

News March 23, 2025

పెద్ద పట్నం కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్మన్

image

ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి ఆదివారం రోజున ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పెద్ద పట్నం, మల్లిఖార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

error: Content is protected !!