News March 22, 2025
సిద్దిపేట: నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: సీపీ

నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట రూరల్ సర్కిల్, దుబ్బాక సర్కిల్ పోలీస్ అధికారులతో పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు.
Similar News
News December 9, 2025
తిరుచానూరు అర్చకులు మధ్య ఆధిపత్య పోరు..?

తిరుమల తరువాత తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి ఆలయంలో అర్చకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. ఆలయంలో అనాధికారిక పరిచారకులను అధికారికంగా చేసుకునే విషయంపై ఓవర్గం వారు విజిలెన్స్ అధికారులకు మరో వర్గం సమాచారం ఇవ్వడంతో విచారణ నడుస్తోందట. మంగళవారం విజిలెన్స్ ఉన్నతాధికారుల నివేదికలో ఏమి తేలుస్తారో చూడాలి.
News December 9, 2025
బాపట్ల: హైవేపై డివైడర్‌ను ఢీకొట్టిన కారు

కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అరుణాచలం నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు డ్రైవర్ నిద్రమత్తులో స్థానిక నయారా పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు ముగ్గురు మహిళలు ఉండగా ఓ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెని 108 అంబులెన్స్‌లో స్థానిక PHCకి తరలించారు.
News December 9, 2025
పాలమూరు: ఎన్నికల మేనిఫెస్టో.. ఆడపిల్ల పుడితే రూ.5,116

నర్వ మండలం రాయికోడ్ స్వాతంత్ర అభ్యర్థి సూరం చంద్రకళ, కృష్ణయ్య GP మేనిఫెస్టోను విడుదల చేశారు.
➤ ప్రతి ఆడపిల్ల పెళ్లికి ‘గ్రామ కళ్యాణం’ కింద రూ.2,116
➤అమ్మ వందనం’ పేరుతో ఆడపిల్ల పుడితే రూ. 5,116, మగబిడ్డ పుడితే రూ.2,116
➤ ఆకస్మిక ప్రమాదం జరిగితే తక్షణ సాయం కింద రూ.20,116 అందజేత
➤పదిలో ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థికి రూ.10,116 నగదు బహుమతి
➤భౌతిక కాయం భద్రత కోసం ఫ్రీజర్ ఏర్పాటు.


