News March 24, 2025
సిద్దిపేట: నేటి నుంచి డీఈఈసెట్కు దరఖాస్తుల స్వీకరణ

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు డీఈవో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.
Similar News
News October 28, 2025
GNT: తుపాను ప్రభావంతో రైళ్ల రద్దు

తుపాన్ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో అనేక రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి, విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్తో పాటు గుంటూరు-నర్సాపూర్, గుంటూరు-రాయగడ, హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా రైళ్లు మంగళవారం రద్దయ్యాయి. బుధవారం రాయగడ-గుంటూరు, భువనేశ్వర్-హైదరాబాద్ రైళ్లు నడవవని తెలిపారు. అదనంగా బెజవాడ-తెనాలి, రేపల్లె, మార్కాపురం మార్గాల్లో పలు రైళ్లు నిలిపివేశారు.
News October 28, 2025
సిద్దిపేటలో ధాన్యం తడిసి ముద్ద.. అన్నదాతల ఆందోళన

సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నేడు కూడా వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కవర్లు కప్పినా నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తితే నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం తేమ శాతం, నిబంధనలను సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
News October 28, 2025
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని, ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 70,842 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 25,125 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.


