News March 24, 2025
సిద్దిపేట: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు డీఈవో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.
Similar News
News April 25, 2025
పోప్ అంత్యక్రియల్లో పాల్గొననున్న రాష్ట్రపతి

ఈనెల 21న కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ఇవాళ వాటికన్ సిటీ వెళ్లనున్న ఆమె రేపు అంత్యక్రియల్లో పాల్గొంటారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపం తెలుపుతారని వెల్లడించింది.
News April 25, 2025
మార్కాపురం: ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు’

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపూరం పట్టణ ఎస్సై సైదు బాబు హెచ్చరించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఆయన గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హితవు పలికారు. ఏవరైనా ఇలా దోరికితే కఠిన చర్యలు ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
News April 25, 2025
సిద్దిపేట: మహిళ ప్రాణం తీసిన పిడుగు

పిడుగుపాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన బెజ్జంకిలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎడ్ల బండి చౌరస్తా సమీపంలోని ఓ చింత చెట్టు సమీప ప్రాంతంలో పిడుగు పడగా దగ్గర ఉన్న టేకు రంగవ్వ (68) మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త శంకరయ్య, కుమారులు, కూతుర్లు ఉన్నారు. అదే ప్రాంతంలో ఉన్న మరో యువకుడు టేకు హరీశ్ స్పృహ తప్పి పడిపోగా చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు.