News September 15, 2024
సిద్దిపేట: నేటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు

నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఈనెల 30 వరకు పోలీస్ కమిషనర్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిద్దిపేట CP అనురాధ తెలిపారు. జిల్లాలోని పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించకూడదని అన్నారు. అలాగే సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 27, 2025
మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అల్లాదుర్గంలో 5, రేగోడులో 6, పెద్ద శంకరంపేటలో 7, టేక్మాల్లో 5, పాపన్నపేటలో 13, హవెలిఘనాపూర్లో 16 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే వాడు మెంబర్ స్థానాలకు టేక్మాల్ మండలంలో ఒకటి, హవేలిఘనపూర్లో మూడు నామినేషన్ దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ దాఖలు అయ్యే అవకాశం ఉంది.
News November 27, 2025
నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూడాలి: SP

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. హవేలిఘనపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల పురస్కరించుకొని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేందుకు, నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
News November 26, 2025
మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.


