News February 9, 2025

సిద్దిపేట: నేడు కొమురవెల్లి మల్లన్న 4వ ఆదివారం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. పట్నం, లష్కర్ వారాలతో పాటు 3వ ఆదివారం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పట్నం వారానికి సుమారు 50 వేలకు పైగా భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News November 15, 2025

బిహార్ రిజల్ట్స్: ఎన్డీఏ డబుల్.. కాంగ్రెస్ ఢమాల్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి ఘోర ఓటమిని తెచ్చిపెట్టాయి. ఎన్డీఏ డబుల్ సెంచరీ కొట్టగా కాంగ్రెస్ మాత్రం 6 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో INCకి 19 సీట్లు రాగా ఈ సారి అందులో మూడో వంతే రావడం గమనార్హం. డబుల్ ఇంజిన్ సర్కారుకే మొగ్గు చూపిన ఓటర్లు రాహుల్ ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇక బీజేపీకి 89 సీట్లు రాగా జనతా దళ్‌కు ఏకంగా 85 వచ్చాయి.

News November 15, 2025

పుట్టపర్తి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు

image

పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను ఈ నెల 17న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించడానికి ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ కోరారు.

News November 15, 2025

అరటి రైతు ఆర్తనాదం

image

అనంతపురం జిల్లాలో అరటి రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంటకు కనీస మద్దతు ధర లేక, కొనేవారు కరువై దయనీయ స్థితి నెలకొంది. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకే ఢిల్లీ మార్కెట్‌కు అరటి చేరుతుండటంతో స్థానిక వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 15వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా, టన్ను ధర రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకే ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.