News February 9, 2025

సిద్దిపేట: నేడు కొమురవెల్లి మల్లన్న 4వ ఆదివారం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. పట్నం, లష్కర్ వారాలతో పాటు 3వ ఆదివారం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పట్నం వారానికి సుమారు 50 వేలకు పైగా భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 12, 2026

జిల్లా కోశాధికారి కార్యాలయాన్ని తనిఖీ చేసిన జేడీ

image

భూపాలపల్లి జిల్లా కోశాధికారి కార్యాలయాన్ని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్ వి.నాగరాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న బిల్లుల ఆన్‌లైన్ ప్రాసెసింగ్ విధానం, పెండింగ్ బిల్లుల స్థితి, జీతభత్యాల చెల్లింపులు, పెన్షన్ కేసుల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిధుల వినియోగం పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు.

News February 12, 2026

నిజామాబాద్ జిల్లాలో క్యాంప్ రాజకీయాలు

image

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన అభ్యర్థులు చేజారకుండా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో అభ్యర్థులను తరలించేందుకు ప్రైవేట్ బస్సులు సిద్ధం చేసినట్లు సమాచారం.

News February 12, 2026

జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

image

ప్రస్తుత కాలంలో కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వారానికోసారి హెయిర్‌ మసాజ్‌ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.