News March 27, 2025

సిద్దిపేట: నేడే ఆఖరు.. సబ్సిడీపై సాగు పరికరాలు

image

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోందని, నేడే చివరి తేది అని అధికారులు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024-25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం ఉంటుందన్నారు.

Similar News

News December 10, 2025

ADB: ఇంకా కొద్ది గంటలే.. ఆలోచించుకో

image

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు.. అలాంటి పల్లెలు అభివృద్ధి చెందితినే దేశం ప్రగతి పరుగులు పెడుతుంది. గ్రామాల అభివృద్ధికి కీలకమైన పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనుంది. ఓటర్ అన్న నీ వజ్రాయుధాన్ని ఉపయోగించడానికి ఇంకా కొద్దిగా సమయం మిగిలింది. మన కులం.. మన వర్గం.. మన పార్టీ అని ఆలోచించుకోకుండా గ్రామానికి మంచి చేసే వాడిని ఎన్నుకో. దేనికైనా లొంగి చెడుకు ఓటేస్తే నిన్ను పట్టుకొని పీడిస్తాడు.

News December 10, 2025

NLG: అన్న పైసలు వేసిన.. రేపు వస్తున్నావా..!

image

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణాల్లో ఉన్న పల్లె ఓటర్లకు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తెగ ఫోన్లు చేస్తున్నారు. “అన్న ఎట్లున్నవే.. పైసలేసిన రేపు వచ్చి ఓటేయండి మీ ఓటే నా గెలుపును డిసైడ్ చేస్తుంది.. తప్పకుండా రావాలి” అని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా ఓటర్లు తమ ట్రావెలింగ్, ఇతర ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

News December 10, 2025

అమెజాన్ భారీ పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలు

image

ఇండియాలో ఈ-కామర్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మరో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. మరోవైపు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ఈ-కామర్స్ ఎగుమతులను $80B వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌‌ను కీలకమైన మార్కెట్‌గా భావిస్తోన్న అమెజాన్.. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 40B డాలర్ల పెట్టుబడి పెట్టింది.