News February 10, 2025
సిద్దిపేట: ‘నేషనల్ హైవే రోడ్ పనులు వేగంగా పూర్తి చేయాలి’

నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నేషనల్ హైవే ఇంజనీర్, కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Similar News
News March 21, 2025
తిరువూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మార్పుపై ఉత్కంఠ

తిరువూరులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మార్పు అంశంపై వైసీపీ ఆచూతూచి అడుగులు వేస్తోంది. ఒప్పందం ప్రకారం ఛైర్‌పర్సన్ మార్పు అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక నేతలు.. ఛైర్మన్‌ను మార్చడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు కౌన్సిలర్లు పార్టీ మారుతారని లోకల్‌గా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ పీఠాన్ని YCP నిలబెట్టుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.
News March 21, 2025
మెదక్: 10338 మందికి 68 సెంటర్లు

నేటి నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లలో 10338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 సెట్టింగ్స్ స్క్వాడ్స్, 68 చీఫ్ సూపర్డెంట్లు, 70 డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.
News March 21, 2025
నల్గొండ: మూల్యాంకనం తేదీలో మార్పు..!

ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ఈనెల 22న జరగాల్సిన మూల్యాంకనం 21వ తేదీ (శుక్రవారం)కి మార్చినట్లు డీఐఈఓ దస్రూ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.