News March 1, 2025
సిద్దిపేట: పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు:కలెక్టర్

ఈనెల 5 నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. జిల్లాలో 43 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈనెల 21 నుంచి జరిగే టెన్త్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 1, 2025
మంచు కొండలు విరిగిపడిన ఘటన.. నలుగురు మృతి

ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. నిన్న మంచుచరియల కింద వీరు చిక్కుకోగా రెస్క్యూ సిబ్బంది వెలికితీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఆరుగురి కోసం ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం 57 మంది చిక్కుకోగా 47 మందిని ఆర్మీ రక్షించింది.
News March 1, 2025
తిరుపతి జిల్లాలో 92.42 శాతం ఫించన్ పంపిణీ పూర్తి

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ జిల్లావ్యాప్తంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.40 వరకు జిల్లాలో 92.42 శాతం పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. యర్రావారిపాలెం 95.15 శాతంతో ముందు స్థానంలో ఉండగా పిచ్చాటూరు 88.64 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. సాయంత్రానికి 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
News March 1, 2025
పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్ డేట్

పోస్టల్ శాఖలో బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 3తో ముగియనుంది. మొత్తం 21,413 ఖాళీలకుగాను ఏపీలో 1,215, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18-40 ఏళ్ల వారు అర్హులు కాగా రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంది. ఈ నెల 6 నుంచి 8 వరకు తప్పుల సవరణకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/