News January 29, 2025

సిద్దిపేట: ‘పదిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి’

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక బద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపళ్లతో సమీక్షా నిర్వహించారు. మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు సిద్ధం చేయాలన ఆదేశించారు.

Similar News

News November 13, 2025

షమీపై లక్నో, ఢిల్లీ ఆసక్తి

image

SRH స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని దక్కించుకునేందుకు లక్నో, ఢిల్లీ ఆసక్తిగా ఉన్నాయని Cricbuzz తెలిపింది. నవంబర్ 15తో రిటెన్షన్ డెడ్‌లైన్ ముగియనుండగా SRH షమీని వదులుకోవచ్చని పేర్కొంది. గత వేలంలో హైదరాబాద్ రూ.10 కోట్లకు షమీని కొనుగోలు చేసింది. కానీ అతడు కేవలం 6 వికెట్లు మాత్రమే తీశారు. గత వేలంలో షమీ కోసం లక్నో రూ.8.5 కోట్ల వరకు వెళ్లింది. అటు ఢిల్లీ యాజమాన్యంలో భాగమైన గంగూలీ షమీపై ప్రశంసలు కురిపించారు.

News November 13, 2025

మక్తల్‌లో డిగ్రీ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్

image

మక్తల్‌లో డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో పాలమూరు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. దీంతో మక్తల్, కృష్ణ, మాగనూరు, నర్వ, ఉట్కూరు ప్రాంతాల విద్యార్థులు ఇకపై నారాయణపేట వెళ్లే ఇబ్బంది తప్పింది. త్వరలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం కూడా సిద్ధమవుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

News November 13, 2025

తిరుమల: ఘంటా మండపం విశిష్టత ఏంటంటే..?

image

తిరుమల సోపాన మార్గంలోని అవ్వాచారి కోనకు దగ్గరగా ఉండే ఘంటా మండపం శ్రీవారి నైవేద్య సమయాన్ని సూచిస్తుంది. 1630 ప్రాంతంలో వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు ఈ ఘంటను చంద్రగిరి రాజు రామదేవరాయలకు బహూకరించారు. తిరుమలలో స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మోగే గంటల ధ్వని ఈ మండపంలోని గంటలను తాకగానే, అవి మోగేవి. ఈ శబ్దం వినిపించాకే చంద్రగిరిలోని రాజు భోజనం చేసేవారని ప్రతీతి. <<-se>>#VINAROBHAGYAMU<<>>