News June 13, 2024

సిద్దిపేట: ‘పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం’

image

వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపైన ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పనితీరును సమీక్షించారు. వర్షాకాలంలో వచ్చే అంటూ వ్యాధులు, దోమల కుట్టడం ద్వారా వచ్చే మలేరియా, చికున్ గన్యా, ఫైలేరియా, డెంగీని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News October 24, 2025

మెదక్ జిల్లాలో 1420 మద్యం దరఖాస్తులు

image

మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాల కోసం 1420 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పోతంశెట్టిపల్లి దుకాణానికి 54 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం సమయం పొడిగించడంతో 33 దరఖాస్తులు పెరిగాయి. మెదక్ సర్కిల్లో 17 దుకాణాలకు 513, నర్సాపూర్ సర్కిల్లో 17 దుకాణాలకు 519, రామాయంపేట సర్కిల్లో 15 దుకాణాలకు 388 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.42.60 కోట్ల ఆదాయం చేకూరింది.

News October 24, 2025

మెదక్: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు స్కూల్ HMలకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News October 23, 2025

RMPT: అజంతా ఎక్స్ ప్రెస్‌లో సాంకేతిక లోపం

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో రెండు గంటలుగా రైలు నిలిచిపోయింది. సికింద్రాబాద్ నుంచి షిరిడి వెళ్తున్న అజంతా ఎక్స్ ప్రెస్ రైలు ఇంజన్ సాంకేతిక లోపం రావడంతో నిలిపివేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రైలుకు వేరే ఇంజను బిగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.