News March 19, 2025
సిద్దిపేట: పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న 79 కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్ సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని సూచించారు.
Similar News
News March 1, 2026
VJA: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా యశ్వంత్‌పూర్(YPR)- సంత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06233 YPR- SRC రైలు మార్చి 1న, నం.06234 SRC- YPR రైలు మార్చి 3న ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు హిందూపూర్, అనంతపూర్, నంద్యాల, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News March 1, 2026
ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని అంతం చేసినట్లు ట్రంప్ ప్రకటన, మీడియా రిపోర్ట్స్ నేపథ్యంలో US తన ప్రధాన లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్‌తో కలిసి చేస్తున్న ఈ దాడుల్లో కొన్ని వందల అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. ఇప్పటివరకు 200 మందికిపైగా చనిపోగా 700 మందికిపైగా గాయపడ్డారు. ఇక మృతుల్లో 85 మంది బాలికలూ ఉన్నారు. మినాబ్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో వీరు ప్రాణాలు కోల్పోయారు.
News March 1, 2026
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంటూరు దక్షిణ మధ్య రైల్వే హోలీ పండుగను పురస్కరించుకుని గుంటూరు మీదుగా శనివారం రాత్రి నుంచి మొదలవుతాయని ఒక ప్రకటనలో తెలియజేశారు. రైళ్ల వివరాలు 07097/07098 చర్లపల్లి – ధనాపూర్, 07998 మచిలీపట్నం – జగదల్పూర్,06233 /06234 యశ్వంత్ పూర్ – సత్ర గంజి,06021/06022 పోధనూర్ -బరౌని, ఈ రైళ్లు మార్చి 12వ తారీకు వరకు నడుస్తాయని తెలిపారు.


