News February 12, 2025
సిద్దిపేట: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 2, 2025
జనగామ: రుద్రమదేవి సొసైటీలో అక్రమాలు.. ఆరుగురి ఉద్యోగుల తొలగింపు

జనగామ జిల్లా కేంద్రంలోని రుద్రమదేవి మహిళా సహకార సొసైటీలో అక్రమాల బాగోతం బయటపడింది. భూమి కొనుగోలు పేరుతో సొసైటీ నిధుల్లో రూ.7.09 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆరుగురు ఉద్యోగులను తొలగించాలని గత నెల 24న తీర్పు రావడంతో, సొసైటీ కార్యాలయానికి నోటీసులు అంటించారు.
News November 2, 2025
గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.
News November 2, 2025
నాకు ప్రాణ భయం.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్

బిహార్ ఎన్నికల వేళ లాలూ పెద్ద కుమారుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణభయం ఉందని, భద్రత మరింత పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో జన్సురాజ్ కార్యకర్త మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ను RJD నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.


