News February 14, 2025

సిద్దిపేట: పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే ఘటనకు 11 ఏళ్లు

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 ఫిబ్రవరి 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం పొన్నం HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News November 19, 2025

కుండలేశ్వర పుణ్యక్షేత్రంలో విషాదం

image

కాట్రేనికోన మండలం కుండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి దర్శనానికి వచ్చిన బొట్టా నిర్మల (67) గుండెపోటుతో మృతిచెందారు. భక్తురాలు నిర్మల స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయం బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

News November 19, 2025

మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ, శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంపు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

News November 19, 2025

కృష్ణా: 1.33 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం

image

పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 1,33,856 మంది రైతులకు 2వ విడత రూ. 88.49 కోట్ల ఆర్థిక సాయం మంజూరైనట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మెగా చెక్కును మంత్రి రవీంద్ర రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గోపిచంద్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని, తదితరులు పాల్గొన్నారు.