News February 9, 2025
సిద్దిపేట: పెండింగ్ పనులను పూర్తి చేయండి :కలెక్టర్

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ పనులను మార్చి మాసం చివరకల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం సమికృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో పంచాయతీ రాజ్ శాఖ చేపడుతున్న పనులపైన పంచాయతీ రాజ్, డీఆర్డీఓ శాఖల అధికారులతో సమీక్షా జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 27, 2025
హైదరాబాద్లో మరో మెగా GCC?

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) హబ్గా హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. మియామిన్ కార్ప్ సంస్థ ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ(బోయింగ్ లేదా ఎమిరేట్స్) కోసం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ GCCని నెలకొల్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా 1,000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.
News November 27, 2025
భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలు.. మొదటి రోజు నామినేషన్లు ఎన్నంటే?

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాలు గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లిలో 82 గ్రామ పంచాయతీలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. 712 వార్డులకు 35 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9030632608 నంబర్కు కాల్ చేయాలని ఆయన చెప్పారు.
News November 27, 2025
KNR: “ఆరోగ్య మహిళ” వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, కలెక్టర్ హాజరై ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. సుమారు రూ.50 వేల విలువచేసే 45 రకాల పరీక్షలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


