News January 30, 2025
సిద్దిపేట: పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు: సీపీ

పోక్సో కేసులో నేరస్థుడికి 20ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సాయి రమాదేవి తీర్పును ఇచ్చారని సీపీ బి. అనురాధ తెలిపారు. త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని పొన్నాలలో ఓ ఇంట్లో యూపీలోని గోరఖ్పూర్ తాలుకా రసూలాపూర్కు చెందిన అజయ్(30) 2024 ఆగస్టు 19న బాలికపై అత్యాచారం కేసులో తీర్పును వెలువరించినట్లు తెలిపారు. నిందితులు తప్పించుకోలేరని, 5 నెలల్లోనే కేసు పూర్తయిందన్నారు.
Similar News
News October 30, 2025
ఇంట్లో పూజ గది ఏవైపున ఉండాలి?

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. అది కుదరకపోతే.. తూర్పు/పడమర వైపు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ‘ప్రతి ఇంట్లో పూజా మందిరం తప్పనిసరిగా ఉండాలి. ఇది మనల్ని నియంత్రిస్తూ, భక్తిని, నమ్మకాన్ని పెంచుతుంది. అయితే.. ఆ గదిలో స్వర్గస్తుల ఫొటోలు ఉండకూడదు. నవగ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు కూడా శుభం కాదు. కులదేవతా ఫొటోలు మాత్రం ఉండవచ్చు’ అన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 30, 2025
ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం: తుమ్మల

TG: తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున అందజేస్తామన్నారు. ఖమ్మంలో వరద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. 4.5లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశుసంపద, ఇళ్లు నష్టపోయిన వారినీ ఆదుకుంటామని చెప్పారు. రేపటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారన్నారు.
News October 30, 2025
GDK నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని GDK డిపో ఆధ్వర్యంలో యాదగిరిగుట్టకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేశారు. NOV 4న ఉదయం 5 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి తిరిగి GDK చేరుకుంటుందని DM నాగభూషణం తెలిపారు. ఈ యాత్రలో యాదగిరిగుట్టతో పాటు స్వర్ణగిరి, కొమురవెల్లి మల్లన్నను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక్కరికి ఛార్జీ ₹1100గా నిర్ణయించారు. రిజర్వేషన్ కోసం 7013504982 నంబర్ను సంప్రదించవచ్చు.


