News March 11, 2025
సిద్దిపేట: పోలీసులకు ఫిర్యాదు చేసిందని చంపేశాడు !

తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో మహిళను చంపేశాడు. HYDకి చెందిన అస్రాబేగం(45), సాదతుల్లా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇండోర్‌కు చెందిన అస్లాంను రెండోపెళ్లి చేసుకోగా ఇద్దరి మధ్య మనస్పర్ధలతో DECలో తిరిగొచ్చి పిల్లలతో ఉంటుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అస్లాం HYDకి వచ్చాడు. ఇద్దరు కలిసి <<15709214>>గజ్వేల్<<>>లోని రిమ్మనగూడెం వద్ద బంకులో పనిచేస్తున్న సాదుతుల్లా వద్దకు వచ్చారు. అస్లాం పారతో కొట్టి చంపాడు.
Similar News
News December 9, 2025
భూ సర్వే రోవర్లను సిద్ధం చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రోవర్స్ పనితీరును మంగళవారం పరిశీలించారు. జిల్లాలో మొత్తం 114 రోవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో 42 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని రీఛార్జి చేయవలసి ఉండగా, మరికొన్ని రిపేర్లు చేయవలసినవి ఉన్నాయని సంబంధిత అధికారులు జేసీకి వివరించారు. రోవర్లకు రీఛార్జ్ చేసుకొని, రిపేర్లు ఉంటే చూసుకోవాలని జేసీ సూచించారు.
News December 9, 2025
స్వాతంత్ర్య సమరాన్ని BJP వ్యతిరేకించింది: ఖర్గే

స్వాతంత్ర్య సమరం, దేశభక్తి గీతాలను వ్యతిరేకించిన చరిత్ర బీజేపీదని AICC చీఫ్ ఖర్గే విమర్శించారు. ‘గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో వందేమాతరం అంటూ లక్షల మంది స్వాతంత్ర్య సమరయోధులు జైలుకు వెళ్లారు. అప్పుడు BJP సిద్ధాంతకర్తలు బ్రిటీషర్ల కోసం పనిచేస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన వందేమాతరం ఉద్యమంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది’ అని ఖర్గే రాజ్యసభలో వ్యాఖ్యానించారు.
News December 9, 2025
పోస్టల్ బ్యాలెట్‌ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

రెండవ, మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులకు వెళ్లే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ సూచించారు. రెండవ విడత మండలాల్లో డిసెంబర్ 7-10, మూడవ విడత మండలాల్లో 10,12,13,15 తేదీల్లో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.


