News March 11, 2025

సిద్దిపేట: పోలీసులకు ఫిర్యాదు చేసిందని చంపేశాడు !

image

తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో మహిళను చంపేశాడు. HYDకి చెందిన అస్రాబేగం(45), సాదతుల్లా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇండోర్‌కు చెందిన అస్లాంను రెండోపెళ్లి చేసుకోగా ఇద్దరి మధ్య మనస్పర్ధలతో DECలో తిరిగొచ్చి పిల్లలతో ఉంటుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అస్లాం HYDకి వచ్చాడు. ఇద్దరు కలిసి <<15709214>>గజ్వేల్‌<<>>లోని రిమ్మనగూడెం వద్ద బంకులో పనిచేస్తున్న సాదుతుల్లా వద్దకు వచ్చారు. అస్లాం పారతో కొట్టి చంపాడు.

Similar News

News March 11, 2026

నల్గొండ: మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల ఊసేదీ?

image

జిల్లాలో కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడి రోజులు గడుస్తున్నా, ఇంతవరకు సమావేశాల ఊసే లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు.

News March 11, 2026

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి మృతి

image

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1984,1989,1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

News March 11, 2026

అన్నమయ్య: 10th విద్యార్థులకు ఫ్రీ బస్.. మంత్రి మండిపల్లి

image

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి 10th విద్యార్థులకు బుధవారం ఆల్ ది బెస్ట్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు 3,415 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు.