News February 1, 2025
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన డీఐజీ

పోలీస్ కమిషనర్ కార్యాలయం, పోలీస్ కన్వెన్షన్ సెంటర్, నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ పంపును వెల్ఫేర్ విభాగం డీఐజీ డాక్టర్ గజరావు భూపాల్ సందర్శించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధతో కలిసి పొన్నాల గ్రామ శివారు పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ పంపు, పోలీస్ కమిషనరేట్‌లోని ఆయా విభాగాలను పరిశీలించారు.
Similar News
News February 16, 2025
నేటి నుంచి పెద్దగట్టు జాతర

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతులు స్వామి(పెద్దగట్టు) జాతర నేటి నుంచి ఈ నెల 20 వరకూ జరగనుంది. ఈ 4రోజుల పాటు అత్యంత ఘనంగా వేడుక జరపనున్నామని, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లూ చేశామని పేర్కొన్నారు. 15లక్షలమందికి పైగా భక్తులు జాతరకు రావొచ్చని అంచనా. రాష్ట్రంలో అతి పెద్దదైన సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఆ స్థాయిలో పెద్దగట్టు జాతర జరుగుతుంటుంది.
News February 16, 2025
మజ్లిస్ మా ప్రధాన శత్రువు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీ తమ ప్రధాన శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మజ్లిస్ పార్టీ చాప కింద నీరులా బలాన్ని పెంచుకుంటోంది. బీజేపీ శ్రేణులు జాగ్రత్త పడాలి. ఆ పార్టీ కోరల్ని పీకాలి. సీఎం రేవంత్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారారు. ఆయన మాటలు కోటలు దాటుతాయి తప్ప పనులు సచివాలయం కూడా దాటట్లేదు’ అని విమర్శించారు.
News February 16, 2025
సిద్దిపేట: మ్యాట్రిమోని పేరుతొ డబ్బులు వసూలు.. నిండుతుడి అరెస్ట్

మ్యాట్రిమోనీ పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితున్ని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్‌కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయి మ్యాట్రిమోనీ పేరుతో అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిండుతుడిని అరెస్ట్ చేశారు.