News April 10, 2025

సిద్దిపేట: పోషకాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలు: సీడీపీఓ

image

పోషకాహార లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని సీడీపీఓ శారదా అన్నారు. గురువారం చిన్నకోడూరు మండలం ఇబ్రహీం పూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆమె మాట్లాడారు. విద్యార్థులు మంచి పోషకాహారం ఉన్న చిరు ధాన్యాలు తినడానికి ప్రయత్నం చేయాలన్నారు.

Similar News

News January 7, 2026

NRPT: 90 గంటల పాటు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్

image

నారాయణపేట మండలం ఏలూరు వద్ద బటర్‌ఫ్లై వాల్వ్ మరమ్మతుల కారణంగా మక్తల్ నియోజకవర్గంలో నేటి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీనివల్ల జిల్లాలోని 8 మండలాలు, 184 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలకు 90 గంటల పాటు అంతరాయం కలగనుంది. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News January 7, 2026

పాలమూరు: ‘నో హెల్మెట్.. నో ఫ్యూయల్’

image

“నో హెల్మెట్ – నో ఫ్యూయల్” అనే నినాదంతో అన్ని పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భగవంత్ రెడ్డి తెలిపారు. హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయరాదని పెట్రోల్ బంక్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజల భద్రత దృష్ట్యా పెట్రోల్ బంక్ యజమానులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

News January 7, 2026

రీ- సర్వే పక్కాగా జరగాలి: బాపట్ల కలెక్టర్

image

రీ- సర్వే పక్కాగా జరగాలని, అప్పుడే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెవెన్యూ రికార్డులన్నీ ఆన్‌లైన్లో రికార్డు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రెవెన్యూ సమస్యలపై సమీక్ష ఉంటుందని తెలిపారు.