News April 9, 2025
సిద్దిపేట: పోషన్ అభియాన్ జయప్రదం చేయాలి

పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమంలో ఎసిఎల్బి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 3, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

చిత్తూరు జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలియజేశారు. విజయపురంలో అత్యధికంగా 24.2 మీ.మీ వర్షపాతం నమోదయింది. కార్వేటి నగరంలో 18, వెదురుకుప్పంలో 12.6, సోమలలో 12.4, రొంపిచర్ల 9.2, ఎస్.ఆర్ పురంలో 7.2, పాలసముద్రం 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది.
News December 3, 2025
NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్‌కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.
News December 3, 2025
సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: ASF SP

ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ భరోసా సెంటర్ భవన నిర్మాణానికి సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SP నితికా పంత్ తెలిపారు. డిసెంబర్ 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు AR పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విల్లింగ్ కొటేషన్స్ స్వీకరిస్తామన్నారు. రూ.కోటిపైగా వ్యయంతో నిర్మాణ అనుభవం, 10 ఏళ్ల సేవ, 4 నెలల్లో పని పూర్తి చేసే సామర్థ్యం అర్హతలుగా పేర్కొన్నారు.


