News September 1, 2024
సిద్దిపేట: ‘ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి’
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల్లో ఉండాలని పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా చెక్ డ్యామ్ లు, చెరువులు నిండాయా, చెరువు తూంలు దుంకుతున్నాయా అని పార్టీ నేతలతో మాట్లాడి ఆరా తీశారు.
Similar News
News September 16, 2024
గుండెపోటుతో టీచర్ మృతి.. నేత్రదానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మోడల్ స్కూల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు ధ్యాప వెంకటస్వామి(49) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. మృతుడి స్వస్థలం జగదేవ్పూర్ మండలం అలిరాజపేట గ్రామం. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, వయస్సు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. వెంకట్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానానికి ఆ కుటుంబీకులు ముందుకొచ్చి మరో ఇద్దరికి చూపు ఇచ్చారని మిత్రబృందం తెలిపింది.
News September 16, 2024
సిద్దిపేటలో అత్యధిక వర్షపాతం నమోదు
తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే వర్షాకాలం కురవాల్సిన దానికంటే ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏటా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 738 మీమీ కురుస్తుంది. ఈ మేరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సీజన్‌లో సెప్టెంబర్ 11 వరకు 897 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో ఎక్కువగా కురిసిందని తెలిపారు.
News September 15, 2024
సంగారెడ్డి: అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఈవో
ఇన్‌స్పైర్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఇన్‌స్పైర్‌కు దరఖాస్తు చేయని విద్యార్థులు గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని సూచించారు.