News August 11, 2025
సిద్దిపేట: ‘ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి’

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కలెక్టర్ కె.హేమావతి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి వివిధ సమస్యలపై 131 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Similar News
News March 10, 2026
HYD: అర్ధరాత్రి సందడే.. సందడి!

రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో HYDలో పది రోజుల పాటు సందడి నెలకొననుంది. చార్మినార్, టోలిచౌకి, పాతబస్తీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నైట్ బజార్లకు నగర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో అర్ధరాత్రి వేళ కూడా ఆ వీధులన్నీ షాపింగ్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. పాతబస్తీలో వ్యాపారాలు జోరందుకోగా, పెరిగిన వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.

రాత్రి మంచి నిద్ర కోసం..

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It