News January 27, 2025

సిద్దిపేట: ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ప్రత్యేకాధికారిగా సిద్దిపేట ఇన్‌ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో ఈ మేరకు గజ్వేల్-ప్రజ్ఞాపూర్, చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీల కమిషనర్ల సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ఆయనను శాలువాతో సన్మానించారు.

Similar News

News December 6, 2025

భారత్‌లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

image

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్‌లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్‌ VVERలను భారత్ నిర్వహిస్తోంది.

News December 6, 2025

471 పంచాయతీలు.. 3 విడతల్లో ఎన్నికలు

image

నేటితో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లోని 471 గ్రామపంచాయతీల నుంచి సర్పంచ్, 4168 వార్డు సభ్యులకు కోసం నామినేషన్లు స్వీకరించారు. మొదటి విడతలో 8 మండలాలకు 11న, 2వ విడతలో 7 మండలాలకు 14న, 3వ విడతలో 7 మండలాలకు 17న ఎన్నికలు జరగనున్నాయి. 4242 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు.

News December 6, 2025

ఎర్రవల్లి: వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్

image

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచి అభ్యర్థులు ఆయన్ను కలిశారు. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కొన్ని కష్టాలు వచ్చినా బెదరకూడదని అన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు.