News February 26, 2026
సిద్దిపేట: ప్రభుత్వ బడిలో కలెక్టర్ తనిఖీ

సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించిన ఆమె, వంటలను మరింత రుచికరంగా సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బిర్యానీ, సాంబారు నాణ్యత మెరుగుపరచాలని, వంటగది మరియు డైనింగ్ హాల్‌ను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.
Similar News
News April 14, 2026
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News April 14, 2026
MBNR: అడుగంటిన జూరాల.. రైతుల్లో ఆందోళన!

ఉమ్మడి MBNRలోని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరాయి. 9.657 TMCల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 0.44 TMCలే ఉండటంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. నీరు తగ్గడంతో శ్రీరంగాపూర్, వీపనగండ్ల మండలాల్లో పంటలు ఎండు ముఖం పట్టాయి. కాలువల్లో చెత్తా పేరుకుపోవడం మరో శాపంగా మారింది. పంట కోత దశలో ప్రభుత్వం ‘క్రాప్ హాలిడే’ ప్రకటించడంతో, 2 తడుల నీరు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2026
అన్నమయ్య జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం పర్యటన

జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం ఈనెల 16న అన్నమయ్య జిల్లాకు రానుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన ఈ బృందం 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించి ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించనుంది. జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు అవుతున్న జలధార ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం “జలధార -జలహారతి” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనుకుంటోందన్నారు.


