News January 29, 2025
సిద్దిపేట: ప్రమాద రహిత డ్రైవర్లకు సన్మానం

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా ప్రమాదరహిత ఆర్టీసీ డ్రైవర్లను రీజినల్ మేనేజర్ ప్రభులత సన్మానించారు. 32ఏళ్లపాటు అత్యధిక కాలం డ్రైవింగ్ చేసి ప్రమాదరహిత డ్రైవర్లుగా మెదక్ రీజియన్లోనే మొదటి, 2వ స్థానాలలో సిద్దిపేట డ్రైవర్లు బి.ఎస్.రెడ్డి, వెంకటయ్య ఎంపికయ్యారని డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలో సిద్దిపేట డిపోకు మొదటి, 2వ స్థానం రావడం హర్షణీయమని RM అన్నారు.
Similar News
News December 5, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. గురువారం 5PM వరకు తిరుపతి(D) చిట్టమూరులో 88.5MM, చింతవరంలో 81MM, నెల్లూరులో 61MM, పాలూరులో 60MM వర్షపాతం నమోదైందని తెలిపింది.
News December 5, 2025
ప్రజలు జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ వ్యాధి చిగర్ మైట్స్ అనే సూక్ష్మ పురుగుల కాటుతో వ్యాపిస్తుందని, ప్రారంభ దశలోనే వైద్య చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేసుకోవచ్చన్నారు.
News December 5, 2025
జిల్లాలో 1,748 పాఠశాలల్లో మెగా PTM: DEO

ఏలూరు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం 1,748 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గురువారం తెలిపారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొంటారన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,19,396 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.


