News March 13, 2025

సిద్దిపేట: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 విద్యాసంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. నియమ నిబంధనలకు లోబడి రిజర్వేషన్ల పద్ధతిలో విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.

Similar News

News March 13, 2025

NZB: వైన్స్ దుకాణాలు బంద్

image

హోలీ పండుగ నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి మద్యం షాపులు మూతపడనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటలు వరకు మూసి ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ షాపులు మూతపడనుండడంతో మద్యం ప్రియులు వైన్ షాప్స్ వద్దకు పరుగులు పెడుతున్నారు.

News March 13, 2025

‘కోర్ట్’కు పాజిటివ్ టాక్.. ప్రియదర్శి ఎమోషనల్

image

ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్‌లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని షేర్ చేశారు.

News March 13, 2025

జనగామ: సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు.  

error: Content is protected !!