News August 8, 2024
సిద్దిపేట: ప్రాజెక్టులకు జలకళ
సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. గోదావరి జలాలు ఎత్తిపోత ప్రారంభించడంతో అనంతగిరి, రంగనాయకసాగర్ జలాశయాలకు జలాలు చేరుతున్నాయి. ప్రస్తుతం అనంతసాగర్ 1.27, రంగనాయకసాగర్ 1.4 TMCలకు చేరింది. మొత్తం 6600 క్యూసెక్కుల నీటిని నింపేందుకు నిర్ణయించారు. మరో 2రోజుల్లో మలన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 5.50 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారుల అంచనా.
Similar News
News September 18, 2024
దుబ్బాక వస్త్రాలంకరణలో అయోధ్య బాల రాముడు
అయోధ్య బాలరాముడిని సిద్దిపేట చేనేత వస్త్రాలతో మనోహరంగా అలంకరించారు. దుబ్బాకలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తయారు చేసిన చేనేత వస్ర్తాలతో నిన్న బాల రాముడు మెరిసిపోయారు. చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్ తెలిపారు.
News September 18, 2024
సంగారెడ్డి: టీవీ చూద్దామని పిలిచి.. చిన్నారిపై అత్యాచారం
చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న యువకుడు (18) ఇంట్లోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఇంటికి వచ్చే సరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు ఫైల్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
News September 18, 2024
సంగారెడ్డి: నవోదయలో ప్రవేశాలు.. ఈనెల 23 వరకు ఛాన్స్
వర్గల్ నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు ఈనెల 23 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని కోరారు.