News November 11, 2024

సిద్దిపేట: ప్రాణం తీసిన చేపల పంచాయితీ

image

బోరబండ ప్రాజెక్టులో చేపల పంచాయితీ ఒకరి ప్రాణం తీసింది. జగదేవపూర్ మండలం ధర్మారం, మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామాలు చేపలు పట్టడంపై గొడవ జరుగుతోంది. శనివారం వరదరాజపూర్ గ్రామస్థులు చేపలు పట్టేందుకు రాగా ధర్మారం గ్రామస్థుల రాకతో పారిపోయారు. ఈ క్రమంలో వరదరాజపూర్ ముచ్చపతి సత్తయ్య(55) ప్రాజెక్టులో పడిపోయాడు. గ్రామస్థులు గుర్తించకపోగా అదివారం గాలించేందుకు రాగా ఉద్రిక్తత నెలకొంది. శవాన్ని బయటకు తీశారు.

Similar News

News November 10, 2025

మెదక్: ‘ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు’

image

సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 2017 సంవత్సరంలో పశు సంచార వైద్యశాలను అందించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, హెల్పర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పశువులకు సేవలందిస్తున్న తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 10, 2025

ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

image

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.

News November 10, 2025

మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 75 దరఖాస్తులు

image

మెదక్ కలెక్టరెట్‌లోని ప్రజావాణిలో మొత్తం 75 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 34, పింఛన్లకు సంబంధించి 14, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 05, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 26 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.