News January 11, 2026
సిద్దిపేట: ‘ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి’

రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాంపల్లిలో నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని లేకపోతే PM కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అవరోధం ఏర్పడుతుందన్నారు.
Similar News
News January 20, 2026
హనుమకొండ: ‘ట్రాఫిక్ రూల్స్ పోలీసులకు వర్తించవా..?’

హనుమకొండ జిల్లా కేంద్రంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ఫొటోస్ తీస్తూ చలాన్ వేస్తున్న పోలీసులకు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా అంటూ పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. నగరంలో పలువురు పోలీసులు హెల్మెట్ లేకుండానే యథేచ్ఛగా బైక్‌లు నడుపుతున్నారని తెలిపారు. అంతేకాకుండా పలువురు పోలీసులైతే ఓ వైపు ద్విచక్ర వాహనం నడుపుతూనే మరోవైపు ఫోన్ మాట్లాడుతున్నారని, రాంగ్ రూట్‌లో కూడా వెళ్తున్నారన్నారు.
News January 20, 2026
మద్దికెర, చిప్పగిరి మండలాలకు అభివృద్ధి నిధులు

నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్‌గా ఎంపికైన మద్దికెర మండలంలో రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అంగన్వాడీలు, హెల్త్ క్లినిక్‌లు, ఆర్వో ప్లాంట్లు, మినీ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. చిప్పగిరి మండలంలో రూ.1.50 కోట్ల పనులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవం

సింహాచలంలో ఏప్రిల్ 20న జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై ప్రాథమిక సమీక్ష జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు.


