News March 23, 2025

సిద్దిపేట: ఫిబ్రవరి 9న సౌదీలో మృతి.. నేడు అంత్యక్రియలు

image

సౌదీ అరేబియాకు బతుకు దేరువు నిమిత్తం కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన జాలిగం అశోక్ వెళ్లగా ఫిబ్రవరి 9న ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతదేహం స్వగ్రామం చేరడానికి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను వేడుకున్నారు. సౌదీ అరేబియా ఎంబసీ అధికారులతో ఎంపీ మాట్లాడి శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. శనివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

Similar News

News November 21, 2025

యాదాద్రికి కార్తీక మాసంలో ₹17.62 కోట్ల ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఈసారి కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నెల రోజులలో ఆలయానికి ₹17,62,33,331 చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ₹3.31 కోట్లు అధికంగా లభించాయి. ఈ మాసంలో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News November 21, 2025

కుసుమ ప్రతిభకు ఎమ్మెల్యే శ్రావణి సత్కారం

image

దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి, దేశ కీర్తిని చాటిన నార్పల మండలం దుగుమరి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కుసుమను ఎమ్మెల్యే బండారు శ్రావణి అభినందించారు. కుసుమను, ఆమె కుటుంబ సభ్యులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆర్థిక సాయం అందించారు. ఎవ‌రెస్ట్‌ను అధిరోహించడమే తన లక్ష్యమ‌ని కుసుమ తెలపగా, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

News November 21, 2025

NCCDలో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌ (NCCD) 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.