News February 23, 2025

సిద్దిపేట: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

Similar News

News November 15, 2025

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం జడ్పీ స్కూల్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి పిలిపించాలని తెలిపారు. పది విద్యార్థులకు బోధించే టీచర్లకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వొద్దని HMకు సూచించారు.

News November 15, 2025

పాఠశాలల అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రతి అధికారికి రెండు పాఠశాలలు కేటాయించి, పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. వినియోగంలో లేని ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల వివరాలను నవంబర్ 22లోపు పూర్తిచేయాలని సూచించారు. విద్యా సంస్థల మౌలిక వసతుల కోసం రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 15, 2025

MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.