News April 11, 2024
సిద్దిపేట: బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తాం: మైనంపల్లి

బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేటలో గురువారం జరిగిన రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణతో కలిసి సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్, కౌన్సిలర్ రియాజుద్దిన్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి భారీ మెజారిటీ వచ్చేలా నాయకులు పనిచేయాలన్నారు.
Similar News
News March 26, 2025
MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..
News March 25, 2025
ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

శివంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పలు రికార్డులను ఆయన పరిశీలించి మందుల నిర్వాహణను తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. పలు విభాగాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News March 25, 2025
మెదక్ పట్టణంలో ATM వద్ద మోసాలు.. జాగ్రత్త

మెదక్‌లో ఓ బ్యాంక్ ATM వద్ద ఇద్దరు వ్యక్తులు డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ATM వద్ద నిలబడి ఎవరికైతే డబ్బులు డ్రా చేయడం రాదో వారినే టార్గెట్ చేస్తూ డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కార్డును మార్చేస్తున్నారు. తన దగ్గర ఉన్న మరో కార్డును వారికిచ్చి అక్కడ నుంచి వెళ్లి వేరే ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేస్తున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ కొత్త తరహా మోసాలతో జాగ్రత్తంగా ఉండాలన్నారు.