News February 3, 2025
సిద్దిపేట: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మోహాన్ రెడ్డి

సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సిద్దిపేట పట్టణానికి చెందిన గంగాడి మోహన్ రెడ్డిని మరోసారి నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయనకే మరో సారి భాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన బీజేపీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 29, 2025
ధ్వజస్తంభం లేని గుళ్లలో ప్రదక్షిణ చేయకూడదా?

‘దాదాపు అన్ని ఆలయాల్లో గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. దీని ప్రతిష్ఠాపన వైభవంగా చేస్తారు. ధ్వజస్తంభం కూడా ఆలయ శక్తిలో భాగమే. అయితే కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు. వాటిని వాయు ప్రతిష్ఠ ఆలయాలు అంటారు. అలాంటి చోట్ల నిత్య పూజ, నైవేద్యాలు తప్పనిసరి కాదు. ధ్వజస్తంభం ఉన్నా, లేకపోయినా గుడిలో ప్రదక్షిణ చేయవచ్చు. ఇంట్లో తులసి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే ఇది కూడా శుభప్రదం’ అని పండితులు చెబుతున్నారు.
News October 29, 2025
సికింద్రాబాద్: జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ (12713-12714) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైలు ఇకనుంచి జనగామ స్టేషన్లో ఆగుతుందని SCR స్పష్టం చేసింది. ఈ నెల 30 నుంచి ఈ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
News October 29, 2025
CM సమాయత్తం చేసిన తీరు అద్భుతం: సత్యకుమార్

NTR జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తుపానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సీఎం అద్భుతంగా సమాయత్తం చేశారని ఆయన అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి సహాయక చర్యలను మంత్రి పర్యవేక్షించారు. యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి, అన్ని విధాలుగా సంసిద్ధుల్ని చేశారని చెప్పారు.


