News February 3, 2025
సిద్దిపేట: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మోహాన్ రెడ్డి

సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సిద్దిపేట పట్టణానికి చెందిన గంగాడి మోహన్ రెడ్డిని మరోసారి నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయనకే మరో సారి భాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన బీజేపీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 13, 2026
MSDలా రాహుల్ ఫినిషర్ పాత్ర: ఆకాశ్ చోప్రా

భారత ప్లేయర్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక క్రికెట్‌లో MS ధోనీలా ఫినిషర్ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. NZతో తొలి వన్డేలో హర్షిత్ క్రీజులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడుతూ సుందర్ వచ్చాక గేర్ మార్చారన్నారు. ధోనీ వలే ప్రశాంతంగా ఉంటూ సింగిల్స్ తీస్తూ అవసరమైప్పుడు భారీ షాట్లు ఆడారన్నారు. బౌలింగ్ కాకుండా ఏ రోల్ పోషించేందుకైనా రాహుల్ సిద్ధంగా ఉంటారని చెప్పారు.
News January 13, 2026
‘యువత’ జైలు పాలు

TG: మత్తు పదార్థాలు వినియోగం, పొక్సో కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. 2025లో పలు కేసుల్లో 42,566 మంది జైలుకు వెళ్లగా వారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వారేనని జైళ్ల శాఖ నివేదిక పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది ఏకంగా 13% అధికమని తెలిపింది. 40,090 మంది తొలిసారి నేరం చేసి జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించింది. గత ఏడాది 3,634 ఖైదీలు విడుదలైనట్లు పేర్కొంది.
News January 13, 2026
వరంగల్ మార్కెట్‌కి 5 రోజుల సుదీర్ఘ సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 5 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 14న (బుధవారం) భోగి, 15న (గురువారం) సంక్రాంతి, శుక్రవారం కనుమ, శనివారం, ఆదివారం వారాంతపు సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి ఐదు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.


