News April 10, 2025

సిద్దిపేట: బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవు: సీపీ

image

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగులకు పాల్పడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హెచ్చరించారు. సీపీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా క్రికెట్‌, మరే ఇతర బెట్టింగ్‌లకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అనేక పెడదారులు పడుతున్నారని అన్నారు.

Similar News

News December 4, 2025

TODAY HEADLINES

image

➻ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
➻ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం చంద్రబాబు
➻ త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: CM రేవంత్
➻ దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు
➻ డాలరుతో పోలిస్తే 90.13కి చేరిన రూపాయి మారకం విలువ
➻ ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మృతి
➻ రెండో వన్డేలో భారత్‌పై సౌతాఫ్రికా విజయం

News December 4, 2025

లింగ నిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల సంఖ్యను పెంచుదాం, ఆడ-మగ సమతుల్యాన్ని సాధిద్దాం అన్నారు. పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.

News December 4, 2025

HYD: వరంగల్ రూట్‌లో బ్లాక్ స్పాట్స్ ఇవే!

image

ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ ఇంజినీర్ల బృందం గుర్తించింది. ముఖ్యంగా CPRI క్రాస్, ఘట్‌కేసర్ బైపాస్ జంక్షన్ ముందు 500 మీ.వద్ద పలు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఉన్న రహదారి సైతం బ్లాక్ స్పాట్ ప్రాంతంగా జాతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గుర్తించినట్లుగా తెలిపింది.