News January 22, 2025
సిద్దిపేట: బేటీ బచావో బేటీ పఢావో పోస్టర్ ఆవిష్కరణ

సిద్దిపేట జిల్లాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పఢావో కార్యక్రమం నిర్వహించారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ చాంబర్లో “బేటీ బచావో బేటీ పఢావో” పోస్టర్స్ని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆవిష్కరించారు. ఈనెల 22 నుంచి మార్చి 8, 2025 మహిళా దినోత్సవం నాటి వరకు ఆడపిల్లల ప్రాముఖ్యతను కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
Similar News
News November 9, 2025
మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

జనాబ్ మౌలానా అబుల్ కలాం అజాద్ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.
News November 9, 2025
ములుగు: Way2Newsలో వరుస కథనాలు.. స్పందించిన సీతక్క

ములుగు(D) కన్నాయిగూడెంలో <<18239952>>పాముకాటుతో బాలుడు<<>> హరినాద్ స్వామి(7) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై Way2News ప్రచురించిన వరుస కథనాలకు మంత్రి సీతక్క స్పందించారు. వైద్యం అందక బాలుడు మృతి చెందినట్లు బంధువుల ఆరోపణతో వైద్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మృతికి కారణమైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యులతో పాటు, అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 9, 2025
NIEPVDలో ఉద్యోగాలు

డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<


